Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్లాన్‌ రూపకల్పనకు కేంద్రం నిధులు

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్లాన్‌ రూపకల్పనకు కేంద్రం నిధులు

Metro Rail : విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్‌ గడువు ఐదేళ్లు దాటింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్లాన్‌ రూపొందించాలని సెంట్రల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు విభాగం కోరింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ రూపకల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థను ఎంపిక చేసింది. విశాఖలో రూ.84.47 లక్షలతో, విజయవాడలో రూ.86.68 లక్షలతో సిస్ట్ర ఎంవీఏ సంస్థ ప్లాన్‌ రూపొందించనుంది. ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నిధులు మంజూరు చేసింది.

New Metro Rail Project

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ, విజయవాడ(Vijayawada) నగరాల్లో మెట్రో ఏర్పాటు చేయాలంటూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. దీనికోసం విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ఫీజబులిటీ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కింద నిధులు మంజూరు చేసింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఈ మెట్రో రైలు ప్రాజెక్టు… అటకెక్కింది. మరల కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో… మెట్రోరైలు ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కోసం మరోసారి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Also Read : CM Chandrababu Naidu: బిల్‌గేట్స్‌ తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

Leave A Reply

Your Email Id will not be published!