UP CM : యూపీలో ఆడపడుచులకు ఉచిత ప్రయాణం
48 గంటల పాటు బస్సుల్లో ఎక్కడికైనా జర్నీ
UP CM : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు దేశ వ్యాప్తంగా. ఈ పండగ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.
ఎక్కడ ఉన్నా చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీలు కడతారు. తాజాగా రక్షాబంధన్ ను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం.
ఈ మేరకు మహిళలకు సంబంధించి రక్షాబంధన్ రోజు 48 గంటల పాటు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని ఆడపడుచులకు సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM) కానుకగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రక్షాబంధన్ అన్నది నా ఆడపడుచులకు శుభవార్త.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ రాష్ట్రంలోని మహిళలందరికీ సురక్షితమైన ప్రయాణం కోసం బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యానాథ్.
అంతకు ముందు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని నిలబెట్టాలని , వారికి ఎల్లప్పుడూ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని కోరారు.
బెంగళూరులో అధికారిక పర్యటనలో ఉన్నారు. రాజ్ భవన్ లో వివిధ స్థానిక పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి రక్షా బంధన్ జరుపుకున్నారు.
ఇదిలా ఉండగా యూపీ సీఎం(UP CM) చేసిన ప్రకటనతో మహిళలు, యువతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమకు ఫ్రీ బస్సు, రైలు సౌకర్యం కల్పించాలని కోరారు.
Also Read : చెన్నై ఎయిర్ పోర్ట్ లో 6 కేజీల పసిడి పట్టివేత