Ashish Mishra : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ లోని లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra)కు బెయిల్ ఇవ్వడంపై కేసు విచారణ జరుగుతోంది అత్యున్నత న్యాయ స్థానం సుప్రీకోర్టులో.
ఆశిశ్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధిత రైతుల కుటుంబాల తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ తరుణంలో ఇవాళ సుప్రీంకోర్టులో యూపీ సర్కార్ అలాంటిది ఏమీ లేదని తెలిపింది కోర్టుకు. ఆశిష్ మిశ్రా (Ashish Mishra)బెయిల్ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించారని బాధిత కుటుంబాలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
వీఐపీ అయినందుకే అతడిని రక్షించారంటూ ఆరోపించారు. లఖింపూర్ ఖేరి కేసులో మిశ్రా బెయిల్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కు ప్రతిస్పందనగా యూపీ సర్కార్ సుప్రీంకోర్టులో తన ప్రతిస్పందనను దాఖలు చేసింది.
బెయిల్ కు వ్యతిరేకంగా అప్పీలు దాఖలు చేసే నిర్ణయం సంబంధిత అధికారుల ముందు పరిశీలన పెండింగ్ లో ఉందని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టులో ఆశిష్ మిశ్రా బెయిల్ ను ప్రభుత్వం వ్యతిరేకించ లేదన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, బెయిల్ దరఖాస్తును యూపీ సర్కార్ వ్యతిరేకించిందని తెలిపింది.
ప్రస్తుతం యూపీలో బీజేపీ గెలవడంతో బాధిత కుటుంబాలను టార్గెట్ చేసే చాన్స్ ఉందంటూ బాధితులు కోర్టును ఆశ్రయించారు.
ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ బాధితుల బంధువులు దాఖలు చేసిన పిటిషన్ ను ఈనెల 30న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు విచారించనున్నారు.
Also Read : కేంద్రం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం