UP Liquor Offer: యూపీలో మందుబాబులకు బంపర్ ఆఫర్ ! ఒకటి కొంటే మరొకటి ఫ్రీ !

యూపీలో మందుబాబులకు బంపర్ ఆఫర్ ! ఒకటి కొంటే మరొకటి ఫ్రీ !

UP Liquor : సాధారణంగా బట్టలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ లపై కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. కొన్ని సార్లు సీజన్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ సేల్ అంటూ కష్టమర్లను ఆకట్టుకోవడానికి యాభై శాతం నుండి తొంభై శాతం వరకు ఆఫర్లు ప్రకటిస్తాయి. కాని భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్న నిత్యం డిమాండ్ ఉండే ఏకైక వస్తువు మద్యం. మద్యంపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకుండా… అమాంతంగా రేట్లు పెంచినా… మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గేది ఉండదు. ఫుల్ బాటిల్ తాగే అలవాటు ఉన్నవాడు… హాఫ్ బాటిల్ తో సరిపెట్టుకుంటాడేమోకాని… మద్యం కొనకుండా ఉండలేదు. దీనికి కారణం మద్యం అనేది చాల మందికి అలవాటు కాదు… వ్యసనంగా మారిపోవడమే. అయితే మద్యం అమ్మకాల్లో కూడా భారీగా ఆఫర్లు పెడితే… ఈ మాట వింటే చాలు మద్యం ప్రియులకు పూనకం వస్తుంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్(UP) లో మందుబాబులకు ఇలాంటి ఆఫర్ ప్రకటించారు… మద్యం సిండికేట్లు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

UP Liquor Offer

ఉత్తర ప్రదేశ్(UP) లోని మద్యం ప్రియులకు శుభవార్త చెప్పారు మద్యం దుకాణాల యజమానులు. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్‌ కొంటే మరొక బాటిల్‌ ఉచితం అంటూ ప్రకటించారు. అంతేకాదుఫుల్‌ బాటిల్‌ కొంటే రూ. 200 డిస్కౌంట్‌. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్‌ కొనసాగుతోంది. దీనితో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మంగళవారం ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్‌, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.

నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్‌ దొరకగానే ఏదో జాక్‌పాట్‌ తగిలినట్లు ఆనందించారు. అలాగే ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్‌ ఉచితం అనే ఆఫర్‌ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.

మద్యం ఆఫర్లకు కారణం ఏమిటంటే ?

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. దీనితో మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. కొత్తగా లాటరీ దక్కించుకున్న వారు తమ షాపులను నిర్వహించాల్సి వస్తుంది. ఫలితంగా ఇప్పటికే మద్యం దుకాణాల్లో ఉన్న స్టాక్ ను క్లియర్ చేసేందుకు… ఈ డిస్కౌంట్ లు ఇస్తున్నారు. కాగా యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ… అయితే మద్యం కాంట్రాక్టర్లు మరో ఐదు రోజుల గడువుకోరడంతో మార్చి 31 వరకు అవకాశం ఇచ్చారు. దీనితో మార్చి 31లోగా ఈ స్టాక్ ను క్లియర్ చేయడానికి డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అ‍మ్మకాలు సాగిస్తున్నారు.

Also Read : Supreme Court: నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ

Leave A Reply

Your Email Id will not be published!