UP Police: రోడ్ల మీద నమాజ్ చేస్తే లైసెన్స్, పాస్‌పోర్ట్ రద్దు – మీరట్ పొలీసులు

రోడ్ల మీద నమాజ్ చేస్తే లైసెన్స్, పాస్‌పోర్ట్ రద్దు - మీరట్ పొలీసులు

UP Police : ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ పోలీసులు(UP Police) కఠిన ఆంక్షలు విధించారు. ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అందరూ దర్గాలు, మసీదుల్లోనే నమాజ్, ప్రార్ధనలు నిర్వహించాలి. అలా కాకుండా రోడ్ల మీద నమాజ్, ప్రార్ధనలు నిర్వహిస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ సీజ్ చేస్తామని స్పష్టం చేసారు. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.

UP Police Special Instructions

ఈ సందర్భంగా మీరట్ పోలీసు(UP Police) సూపరింటెండెంట్ ఆయుష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ… “మసీదు, ఈద్గాల్లోనే ఈద్ ప్రార్థనలు నిర్వహించాలి. ప్రజలు శాంతియుతంగా పండుగ చేసుకోవాలని కోరారు. రోడ్ల మీద ఎవరు నమాజ్ చేయకూడదు. అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఒక్కసారి క్రిమినల్ కేసు నమోదైతే… వారి పాస్‌పోర్ట్ సీజ్ చేస్తాం… డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. పాస్‌పోర్ట్ తిరిగి పొందాలంటే… కోర్టు నుంచి నో అబ్జెక్షన్ ఫామ్ తెచ్చుకోవాలి” అని ఆయన తెలిపారు. అలానే “సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసే వారి మీద, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని విక్రమ్ సింగ్ హెచ్చరించారు.

“గత సంవత్సరం, కొంతమంది వ్యక్తులు మా ఆదేశాలను ధిక్కరించి రోడ్లపై ప్రార్థనలు చేశారు. దీని ఫలితంగా 80 మందికి పైగా వ్యక్తులపై చర్యలు తీసుకున్నాము. ఈసారి, ఎవరైనా ఈ నియమాలని ఉల్లంఘించినట్లయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము” అని ఆయన తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి మీరట్ పోలీసులు నిబంధనలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే హిందుత్వ ప్రభుత్వం అని ముద్ర వేసుకున్న యోగి ఆధిత్యనాద్ సర్కార్ పై… మీరట్ పోలీసుల తాజా నిర్ణయంతో మైనార్టీ వర్గాల నుండి దేశ వ్యాప్తంగా మరింత వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

Also Read : Kunal Kamra: మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్‌ కమెడియన్‌ కుణాల్‌ కామ్రా

Leave A Reply

Your Email Id will not be published!