Pooja Shukla : యూపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికారంలో ఉన్న యోగి ప్రభుత్వానికి సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కు మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది.
ఈ తరుణంలో ఎస్పీకి చెందిన ఫైర్ బ్రాండ్ గా పేరొందిన పూజా శుక్లా(Pooja Shukla) మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇప్పటికే ఆమె సీఎం యోగిని అడ్డుకున్న ధీర వనితగా పేరొందారు.
ప్రభుత్వ దమనకాండను ప్రశ్నిస్తూ వస్తున్నారు. సమస్యలను ప్రస్తావిస్తూ సర్కార్ ను ముప్పు తిప్పలు పెడుతూ అంతా తన వైపు చూసేలా చేస్తున్నారు.
ఈ తరుణంలో ప్రస్తుతం ఎన్నికల నగారా మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం.
దీంతో యూపీలోని లక్నో నార్త్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పూజా శక్లాను బరిలోకి దింపారు.
దీంతో అంతా ఎవరీ పూజా శుక్లా అని వెతకటం ప్రారంభించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో పార్టీ పరంగా చూస్తే ఆమెనే అత్యంత పిన్న వయస్కురాలు కావడం విశేషం. ఆమె విద్యార్థి దశ నుంచే రెబల్ లీడర్ గా పేరొందారు.
తనకు ఏ మాత్రం అవకాశం ఉన్నా యోగి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు.
దీంతో ఆమె అనతి కాలంలోనే ఎస్పీలోనే కాదు రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
తనకంటూ ఎవరూ గాడ్ ఫాదర్ లేక పోయినా ఒంటరిగానే ముందుకు వచ్చారు.
తనను తాను నాయకురాలిగా, పోరాట యోధురాలిగా మల్చుకున్నారు పూజా శుక్లా. యోగిని టార్గెట్ చేసింది జైలు పాలైంది.
ఎన్నో ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. పలుసార్లు చెరసాల జీవితాన్ని అనుభవించారు.
కానీ ఎక్కడా అధైర్య పడలేదు. తనను టార్గెట్ చేసినా హింసించినా ఎదురొడ్డి నిలుస్తానంటూ ప్రకటించారు.
యోగికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం లక్నో నార్త్ నుంచి బీజేపీ నుంచి బరిలో ఉన్న నీరజ్ బోరాతో ఢీకొన బోతున్నారు.
పూజా శుక్లా డైనమిజం పని చేస్తుందా లేక యోగి మార్క్ రాజకీయం నెగ్గుతుందా అన్నది వేచి చూడాలి.
Also Read : మోదీ వేషధారణ కేసీఆర్ నిరాదరణ