Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ షాక్ !యుపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేదం !
పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ షాక్ !యుపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేదం !
Puja Khedkar: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ(UPSC)) రద్దు చేసింది. ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్-2022 నియమాలను ఉల్లంఘించినట్లు తేలిందని, అందుకే భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలను రాయకుండా ఖేడ్కర్‌పై శాశ్వత నిషేధం విధించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్స్ పరీక్షలను పరిమితికి మించి రాయడంపై జులై 18న పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ షోకాజ్ నోటీసులు జారీ చేసి, అదే నెల 25లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఆమె, ఆగస్టు 4 వరకు సమయం ఇవ్వాలని కోరారు. దీనితో జులై 30 మధ్యాహ్నం 3.30 గంటల వరకు యూపీఎస్సీ అనుమతించింది. అయితే, గడువులోగా సరైన స్పందన రాకపోవడంతో తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
‘‘34 ఏళ్ల పూజపై ఆరోపణల నేపథ్యంలో 2009-2023 మధ్య ఐఏఎస్ స్ర్కీనింగ్ ప్రక్రియను పూర్తి చేసిన 15 వేలమందికి పైగా అభ్యర్థుల డేటాను పరిశీలించినట్టు ప్యానల్ వెల్లడించింది. అనుమతించిన దానికంటే ఎక్కువసార్లు పరీక్ష రాయడానికి ఆమె తన పేరుతోపాటు తల్లిదండ్రుల పేర్లను కూడా మార్చేసినట్లు తేలింది. సివిల్స్ పరీక్షల్లో మున్ముందు ఇలాంటి తప్పులు దొర్లకుండా కఠిన నిర్ణయం తీసుకున్నాం. యూపీఎస్సీ చరిత్రలో గత 15 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి’’ అని యూపీఎస్సీ స్పష్టంచేసింది.
Puja Khedkar – వ్యవస్థలోని పూజా ఖేద్కర్ లనూ గుర్తించాలి – సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్(Puja Khedkar) పై యూపీఎస్సీ అనర్హత వేటువేయడంపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ స్పందించారు. ఇప్పుడు వ్యవస్థలోని పూజా ఖేద్కర్‌లనూ గుర్తించాల్సిన సమయం అసన్నమైందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్ గా కొత్త సారథి వచ్చినందున ఇందులో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని, తప్పులను దిద్దుబాటు చేయాల్సిన బాధ్యత ఆమెపై ఉందన్నారు.
Also Read : Himachal Cloudburst: హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి ! 30 మంది గల్లంతు !