PM Modi : అర్బన్ నక్సల్స్ ఆటలు సాగవు – మోదీ
అసమ్మతి వాదులపై ప్రధాని ఆగ్రహం
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట మరోసారి అర్బన్ నక్సల్స్ మాట వచ్చింది. ఆయన ఇటీవల పదే పదే ఈ పదాన్ని వాడుతూ వస్తున్నారు. ప్రధానంగా నర్మాదా నదిపై ప్రాజెక్టును కట్టకుండా పర్యావరణం పేరుతో అడ్డుకోవడాన్ని తప్పు పట్టారు. దీని వెనుక కొందరి కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
అంతే కాకుండా తాజాగా మరో సంచలన ఆరోపణలు చేశారు మోదీ. కొత్త అవతారంలో గుజరాత్ లోకి ప్రవేశించేందుకు వారంతా యత్నిస్తున్నారంటూ కానీ వారి ఆటలు ఇక సాగవని హెచ్చరించారు నరేంద్ర మోదీ(PM Modi) . నర్మదా నదిపై సర్దార్ పటేల్ కలల ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అర్బన్ నక్సల్స్ ను ఎక్కువగా అసమ్మతివాదులను అభివర్ణించేందుకు కాషాయ శిబిరం (బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ) తరచుగా ఉపయోగించే పదం. దీనిని తప్పు పట్టారు ప్రధానమంత్రి. గుజరాత్ లోని ఆనంద్ లో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. అసమ్మతి వాదుల కారణంగా డ్యామ్ నిర్మాణానికి ముందు 40 ఏళ్ల పాటు సమయాన్ని వృధా చేశామని అన్నారు మోదీ.
అనేక ప్రయత్నాల తర్వాత ఇవాళ సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం పూర్తియందన్నారు ప్రధానమంత్రి. అర్బన్ నక్సల్స్ తమ రూపురేఖలను మార్చుకుని పశ్చిమ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే గుజరాత్ యువత జీవితాలను నాశనం చసేందుకు అనుమతించదని అన్నారు.
బరూచ జిల్లాలో దేశంలోని మొట్టమొదటి బల్క్ డ్రగ్ పార్క్ కు శంకు స్థాపన చేశారు ప్రధానమంత్రి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోదీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : దేశ్ ముఖ్ బెయిల్ పై సుప్రీంకు ఈడీ