Joe Biden Visit : భార‌త్ లో ప‌ర్య‌టించ‌నున్న బైడెన్

సెప్టెంబ‌ర్ లో రానున్న యుఎస్ ప్రెసిడెంట్

Joe Biden Visit : అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ భార‌త దేశంల్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో రానున్నారు. ఈ విష‌యాన్ని అమెరికా ప్ర‌భుత్వం ఇంకా అధికారికంగా వెళ్ల‌డించలేదు. భార‌త దేశ సంబంధాల‌పై యుఎస్ జి20లో ఇండియా నాయ‌క‌త్వం ప్ర‌పంచంలో మంచి కోసం ఒక శ‌క్తిగా నిల‌బ‌డే సామ‌ర్థ్యాన్ని మ‌రింత విస్తృతం చేస్తుంద‌ని పేర్కొంది.

భార‌త దేశ సంబంధాల‌పై యుఎస్ అమెరికా చీఫ్ జో బైడెన్(Joe Biden Visit) ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో భార‌త్ కు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. 2023 సంవ‌త్స‌రం భార‌తదేశం, అమెరికా బంధానికి పెద్ద సంవ‌త్స‌రం కాబోతోందంటూ ద‌క్షిణ‌, మ‌ధ్య ఆసియా పాయింట్ ప‌ర్స‌న్ స్ప‌ష్టం చేశారు. జి-20లో భార‌త దేశం నాయ‌క‌త్వం ప్ర‌పంచంలో మంచి కోసం ఒక శ‌క్తిగా నిల‌బ‌డే సామ‌ర్థ్యాన్ని మ‌రింత విస్తృతం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ ఏడాది అమెరికా, భార‌త్ కు కీల‌క సంవ‌త్స‌రం. వాస్త‌వానికి భార‌త దేశం ప్ర‌స్తుతం జి20కి ఆతిథ్యం ఇస్తోంది. ఇదే ఏడాది యుఎస్ ఏపీఈసీకి ఆతిథ్యం ఇస్తోంది. జ‌పాన్ జి7కి వేదిక కానుంది. నాయ‌క‌త్వ పాత్ర‌లు పోషిస్తున్న క్వాడ్ స‌భ్యులు చాలా మంది ఉన్నారు. ఆయా దేశాల‌ను ఒక చోటుకు చేర్చేందుకు వీల‌వుతుంద‌ని పేర్కొన్నారు. ఇక యుఎస్ అధ్య‌క్షుడు జో బైడెన్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో(PM Modi) ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు.

Also Read : 2023లో మిలియ‌న్ వీసాలు జారీ – లూ

Leave A Reply

Your Email Id will not be published!