Donald Lu : 2023లో మిలియ‌న్ వీసాలు జారీ – లూ

యుఎస్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ డోనాల్డ్

Donald Lu : అమెరికా అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ డోనాల్డ్ లూ(Donald Lu) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ద‌క్షిణ‌, మ‌ధ్య ఆసియా కోసం ఒక మిలియ‌న్ కంటే ఎక్కువ‌గా వీసాలు జారీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2023లో భార‌తీయుల‌కు ప్ర‌ధానంగా మిలియ‌న్ కంటే ఎక్కువ వీసాలు జారీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

వ‌ర్క్ వీసాల‌కు కూడా అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. హెచ్-1బి, ఎల్ వీసాలు , భార‌త దేశం నుండి ఐటీ నిపుణులు ఎక్కువ‌గా కోరుకుంటున్నార‌ని వెల్ల‌డించారు డోనాల్డ్ లూ. సాద్య‌మైనంత మేర‌కు ఎక్కువగా వీసాలు జారీ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ వేస‌విలో బైడెన్ ప‌రిపాల‌న వ‌చ్చాక ఎక్కువ‌గా భార‌త్ కు ప్ర‌యోజ‌నం చేకూరింద‌న్నారు. వీసాల‌న్నింటిని ప్రాసెస్ చేస్తుంద‌ని నిర్ధారించేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌ని పేర్కొన్నారు డోనాల్డ్ లూ(Donald Lu).

హెచ్-1బి వీసా అనేది వ‌ల‌సేత‌ర వీసా. ఇది యుఎస్ కంపెనీలు సైద్దాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవ‌స‌ర‌మ‌య్యే ప్ర‌త్యేక వృత్తుల‌లో విదేశీ ఉద్యోగుల‌ను నియ‌మించుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. భార‌త దేవం , చైనా వంటి దేశాల నుండి ప్ర‌తి ఏటా 10 వేల మంది జాబ‌ర్స్ ను నియ‌మించుకుంటున్నాని డోనాల్డ్ లూ స్పష్టం చేశారు.

Also Read : భార‌త్ లో ప‌ర్య‌టించ‌నున్న బైడెన్

Leave A Reply

Your Email Id will not be published!