Eric Garcetti : భారత రాయబారిగా ఎరిక్ గార్సెట్టి
ఓటు వేయనున్న యుఎస్ సర్కార్
Eric Garcetti US Ambassador : అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బుధవారం భారత రాయబారిగా ఎరిక్ గార్సెట్టి నామినేషన్ పై యుఎస్ సెనేట్ ఓటు వేయనుంది. సెనేట్ ధృవీకరించినట్లయితే గార్సెట్ యుఎస్ రాయబారిగా భారత దేశానికి వెళతారు. ఈ స్థానం రెండు సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉంది. గత వారం సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఎరిక్ గార్సెట్టి(Eric Garcetti US Ambassador) నామినేషన్ కు అనుకూలంగా 13-8 ఓటు వేసింది.
ఇవాళ రాయబారి ఎంపికపై ఇవాళ ఓటు వేసే విషయంపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. ఇదిలా ఉండగా సెనేట్ మెజారిటీ నాయకుడు చక్ షుమెర్ లాస్ ఏంజెల్స్ మేయర్ గా ఉన్న సమయంలో ఆయన సిబ్బందిలో ఒకరిపై లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు ఎరిక్ గార్సెట్టి. ఈ మధ్యన ఈ ఆరోపణలు మరింతగా పెరిగాయి.
ఒకవేళ సెనేట్ ధ్రువీకరించినట్లయితే ఎరిక్ గార్సెట్టి త్వరలో యుఎస్ రాయబారిగా భారత దేశానికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీనికి ముందు ఆయన నామినేషన్ పై క్లాచర్ మోషన్ పై ఓటు వేయబడుతుంది. ఇది ఎరిక్ గార్సెట్టిని భారత దేశంలో యుఎస్ రాయబారిగా ధృవీకరించేందుకు తగినంత ఓట్లను కలిగి ఉంటుందని షుమెర్ విశ్వసిస్తున్నట్లు సమాచారం.
ఎరిక్ గార్సెట్టి నామినేషన్ జూలై 2021 నుండి యుఎస్ కాంగ్రెస్ ముందు పెండింగ్ లో ఉంది. అమెరికా యుఎస్ చీఫ్ జోసెఫ్ బైడెన్ గార్సెట్టి ను ప్రతిపాదించారు. మరో వైపు న్యూఢిల్లీ లోని యుఎస్ రాయబారి నివాసంలో కెన్నెత్ జస్టర్ అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత జనవరి 2021లో పదవీ విరమణ చేశారు.
Also Read : యుఎస్ డ్రోన్ ను కూల్చేసిన రష్యా