US Visa Interview : వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్
మరో ఏడాది పాటు ఇంటర్వ్యూ ఉండదు
US Visa Interview : కరోనా కారణంగా వీసా మంజూరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ప్రత్యేకించి భారత్ నుంచి అత్యధికంగా రద్దీ ఉంటోంది యుఎస్ కు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున వీసాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడింది.
ఈ మేరకు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ అమెరికా పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరగా వీసాలు మంజూరు చేయాలని సూచించారు. ఇదే సమయంలో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ తో భేటీ అయ్యారు. గంటకు పైగా ఇదే అంశానికి సంబంధించి చర్చించారు.
త్వరలోనే వీసాలు(US Visa Interview) జారీ ప్రక్రియ కొనసాగుతుందని, సిబ్బందిని కూడా నియమించనున్నట్లు హామీ ఇచ్చారు. తాజాగా అమెరికా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశం తో పాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వృత్తి నిపుణులకు తీపికబురు చెప్పింది. కొన్ని రకాల తాత్కాలిక వీసా దరఖాస్తుదారులకు కల్పించిన ఇంటర్వ్యూ మినహాయింపు సదుపాయాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.
తాత్కాలిక వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు సంబంధించి హెచ్ 2 వీసాలు, విద్యార్థులకు సంబంధించి ఎఫ్ , ఎం వీసాలు , అకడమిక్ ఎక్సేంజ్ విజిటర్ల కోసం ఇచ్చే జే వీసాల కేటగిరీల వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది యుఎస్ సర్కార్.
స్పెషల్ ఆక్యుషేన్స్ ట్రైనీ , స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్స్ కు సంబంధించి హెచ్3 వీసాలు , ఎల్ వీసాలు కలిగిన వారు, అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే ఓ వీసాలు, క్రీడాకారులు, ఎంటర్ టైనర్లకు ఇచ్చే పీ వీసాల వారికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
Also Read : ఆధార్ తో పాన్ కార్డు లింకు తప్పనిసరి