John Kirby : భారత దేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యం
వైట్ హౌస్ కో ఆర్డినేటర్ జాన్ కిర్బీ
John Kirby : అమెరికా తన అభిప్రాయాలను మార్చుకుంటోంది. భారత దేశం పట్ల ఇటీవల సానుకూల ధోరణి కలిగి ఉంది. ఇందుకు సంబంధించి త్వరలోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ ఆహ్వానం మేరకు యుఎస్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఆ దేశ రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి లాయడ్ ఆస్టిన్ ఇండియాను సందర్శించారు. ఈ తరుణంలో తాజాగా వైట్ హౌస్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ(John Kirby) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో నిజమైన ప్రజాస్వామ్యానికి చిరునామా భారత దేశం అని పేర్కొన్నారు. న్యూఢిల్లీకి వెళ్లే ప్రతి ఒక్కరూ తమను తాము చూడగలరని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఏమీ లేదని అభిప్రాయపడింది. జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ ల కోసం మీడియాతో ముచ్చటించారు జాన్ కిర్బీ.
భారత దేశం, అమెరికా దేశాల మధ్య కొన్నేళ్లుగా సత్ సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. జో బైడెన్ కొలువు తీరాక అది మరింత బలపడిందని చెప్పారు. అమెరికాకు సంబంధించి భారత్ కీలకమైన భాగస్వామి అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఇండో పసిఫిక్ భద్రతకు సంబంధించి కీలక చర్చలు జరిగాయని, రాబోయే కాలంలో కూడా దీనిపై ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుందని చెప్పారు కిర్బీ. ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్యం కూడా తారా స్థాయిలో ఉందన్నారు.
Also Read : Sanjay Raut : రైల్వే మంత్రి రాజీనామా చేయాల్సిందే