Uttam Kumar Reddy : హైదరాబాద్ – తెలంగాణ సీఎం రేసులో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్బంగా నేరుగా ఏఐసీసీ పరిశీలకుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో గంటకు పైగా సమావేశం అయ్యారు.
Uttam Kumar Reddy Comment
అనంతరం లోక్ సభకు వెళ్లారు. అక్కడ స్పీకర్ ను కలుసుకున్నారు. ఈ మేరకు తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు స్పీకర్ ఫార్మాట్ లో అందజేశారు.
అనంతరం డీకే సురేష్ నివాసంలో డిప్యూటీ సీఎంతో భేటీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఏం మాట్లాడారనే దానిపై తెలియ రాలేదు. అయితే మీడియాతో మాట్లాడారు. ఎవరు సీఎం కాబోతున్నారంటూ . దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నో కామెంట్ అంటూ వెళ్లి పోయే ప్రయత్నం చేశారు.
చివరకు మీడియా ప్రశ్నించడంతో సీఎం పదవి విషయంపై స్పందించారు. పార్టీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు కానీ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read : BRS Leaders Tension : గులాబీ నేతల్లో గుబులు