Uttam Kumar Reddy : బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవు
మేడిగడ్డ కుంగుబాటుకు సర్కార్ దే బాధ్యత
Uttam Kumar Reddy : మేడిగడ్డ – తెలంగాణ నీటి పారదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సీరియస్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అనేది అతి పెద్ద ప్రమాదం ఉందన్నారు. శుక్రవారం మంత్రులతో కలిసి ప్రాజెక్టులను సందర్శించారు.
Uttam Kumar Reddy Comment
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దారుణమన్నారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడు సంవత్సరాలలో ఎలా కుంగుబాటుకు గురవుతుందని ప్రశ్నించారు.
పూర్తి నివేదికను తయారు చేస్తామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ను చిన్న తప్పుగా చూపించడం అబద్దమన్నారు. ఎన్నికల ముందు తమపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
తాము దీన్ని రాజకీయంగా లబ్ది పొందాలని చూడటం లేదన్నారు మంత్రి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లో మొత్తం నీటిని తీయాల్సి వస్తుందన్నారు. ఎస్సార్ఎస్పీ స్టేజి మొత్తం దెబ్బ తింటుందని అన్నారు.
Also Read : Land Crusiers : సీఎం కామెంట్స్ బయటకొచ్చిన వెహికిల్స్