Uttam Kumar Reddy : ఎల్ అండ్ టీపై ఉత్తమ్ సీరియస్
తప్పించు కోవాలని చూస్తే ఊరుకోం
Uttam Kumar Reddy : హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పటికే ప్రజా ధనాన్ని నీళ్ల కంటే వేగంగా ఖర్చు చేశారు. ఒకటా రెండా ఏకంగా రూ. 1,20,000 కోట్లు తగలేశారు. కాళేశ్వరం తెలంగాణ పాలిట శాపంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనినే ఎక్కువగా ప్రచారం చేస్తూ వచ్చింది ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ.
Uttam Kumar Reddy Serious on L&T
సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై సీరియస్ అయ్యారు. సిట్టింగ్ జడ్జితో విచారణ కు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆద్వర్యంలో సమీక్ష చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజి పనులు చేపట్టిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్ తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకంగా పనులు ఎలా చేపట్టారంటూ ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏదో ఒక లెటర్ ఇచ్చి తమ ప్రమేయం ఏమీ లేదంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. ప్రాజెక్టు కూలి పోయేందుకు కారణమైన వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read : CM Revanth Reddy : రేవంత్ కు జోగులాంబ దీవెనలు