Uttarakhand Teen Murder : అంతా మోసం ఆపై దహనం
19 ఏళ్ల రిసెప్షనిస్ట్ తల్లి సంచలన ఆరోపణ
Uttarakhand Teen Murder : ఉత్తరాఖండ్ లో 19 ఏళ్ల బాలిక దారుణ హత్య కేసు తీవ్ర ఉద్రిక్తతకు(Uttarakhand Teen Murder) దారి తీసింది. తనకు తెలియకుండానే తన కూతురిని తనకు చూపించకుండానే దహనం చేశారంటూ ఆరోపించింది.
తాను క్షేమంగా ఉన్నానని తప్పుడు సాకుతో ఆస్పత్రికి తరలించినట్లు వాపోయింది. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని వారు నన్ను ఇక్కడకు వచ్చేలా చేశారంటూ ధ్వజమెత్తింది.
ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన కూతురి వద్దకు తీసుకు వెళతామని చెప్పారని తీరా చూస్తే తాను ఆస్పత్రికి వెళ్లేలా నిర్వాహకులు మోసం చేశారంటూ ఆరోపించింది.
ఇందుకు సంబంధించిన బాధితురాలి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నేను నివసించే అడవి నుండి ఇక్కడకు తీసుకొచ్చారు. నా కూతురును చివరకు చూడకుండా చేశారంటూ మండిపడింది.
తనను ఎక్కడికి తీసుకు వెళుతున్నారంటూ అడిగానని కూతురి వద్దకేనంటూ నమ్మించి మోసం చేశారంటూ వాపోయింది బాధితురాలి తల్లి. డాక్టర్లు నన్ను వీల్ చైర్ లో కూర్చోబెట్టారు.
అది ఎందుకు అవసరమని అడిగా. కానీ వారు నన్ను ఆస్పత్రిలో తిక్కదానిగా మార్చేశారంటూ మండిపడింది. నా వద్దకు నలుగురు వచ్చారు. కూతురు వద్దకు తీసుకు వెళతామంటూ నమ్మించారు.
ఆపై ఆస్పత్రిలో చేర్చారు. ఇదీ వీరు చేసిన నిర్వాకం అంటూ పేర్కొంది. భారీ నిరసనల మధ్య టీనేజ్ రిసెప్షనిస్ట్ ను నిన్న సాయంత్రం దహనం చేశారు.
ఈ కేసులో ప్రభుత్వ చర్యపై కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నలు సంధించారు. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరం