V Hanumantha Rao : ముందు గెలుద్దాం తర్వాత సీఎం
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
V Hanumantha Rao : హైదరాబాద్ – పీసీసీ మాజీ చీఫ్ హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం పదవి కోసం పోటీ ఎందుకు పడాలని ప్రశ్నించారు. పార్టీలో ఎవరికి వారు నేనే సీఎం అంటున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఎవరికి వారే సీఎం అనుకుంటున్నారని ఇది పార్టీకి చేటు తప్ప మంచి చేయదన్నారు.
V Hanumantha Rao Comment
గతంలో తనకు సీఎం ఛాన్స్ వచ్చిందని, కానీ తాను దానిని కోల్పోవడం జరిగిందన్నారు వీహెచ్ హనుమంత రావు(V Hanumantha Rao). ఎవరు ముఖ్యమంత్రి అనే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మన ముందున్న లక్ష్యం అధికారంలోకి రావడం. దాని వైపు ఫోకస్ పెట్టకుండా సీఎం పదవి రేసులో ఉన్నానంటూ చెప్పడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆవేదన చెందారు.
ఇకనైనా సీనియర్ నాయకులు చవకబారు ప్రకటనలు చేయకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందు ఎన్నికల్లో గెలుద్దాం. తర్వాత సీఎం పంచాయతీ గురించి ఆలోచిద్దామని సూచించారు.
ఇదిలా ఉండగా వీహెచ్ హనుమంత రావు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రస్తుతం కాంగ్రెస్ రేసులో రేవంత్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, మల్లు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , వీహెచ్ హనుమంతరావు ఉన్నారు.
Also Read : Palvai Sravanthi : కాంగ్రెస్ కు పాల్వాయి గుడ్ బై