V Hanumantha Rao : పవన్ కామెంట్స్ వీహెచ్ సీరియస్
మోదీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు
V Hanumantha Rao : హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ టీపీసీసీ చీఫ్ వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు. నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీకి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ప్రకటించడం దారుణమన్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని ఎలా చెబుతారంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే మోదీ తన పక్కన కూర్చో బెట్టుకున్నారని పేర్కొన్నారు.
V Hanumantha Rao Serious On Pawan Kalyan
కేవలం స్వ ప్రయోజనాల కోసమే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు వీహెచ్ హనుమంతరావు(V Hanumantha Rao). దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ప్రాతినిధ్యం లేక పోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రజలు తిరస్కరించడం ఖాయమని జోష్యం చెప్పారు.
కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లకు పైగా దోచుకుందని , ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మోసం చేశారని వారికి గుణపాఠం చెప్పక తప్పదన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీకి జనం బ్రహ్మరథం పడుతున్నారంటూ స్పష్టం చేశారు మాజీ టీపీసీసీ చీఫ్. తమకు 70 నుంచి 76 సీట్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read : Siddaramaiah : కర్ణాటక రైతులకు ఖుష్ కబర్