Vallabhaneni Vamsi: వంశీకి షాక్ ఇచ్చిన నూజివీడు కోర్టు ! బెయిల్ పిటిషన్ కొట్టివేత !
వంశీకి షాక్ ఇచ్చిన నూజివీడు కోర్టు ! బెయిల్ పిటిషన్ కొట్టివేత !
Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో వంశీని కస్టడీకి కోరుతూ హనుమాన్ జంక్షన్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో రెండు రోజులు కస్టడీకి ఇవ్వాలని నూజివీడు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
Vallabhaneni Vamsi – వంశీకు మళ్ళీ అనారోగ్యం జీజీహెచ్‌కు తరలింపు
పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోర్టుకు వచ్చిన సమయాల్లో కూడా వంశీ ఎంతో నీరసంగా కనిపించారు కూడా. చాలా రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో మాజీ ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తరువాత ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి అనారోగ్య సమస్యతో వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు పోలీసులు.
శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని(Vallabhaneni Vamsi) సోమవారం పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీ సమయంలో వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మాజీ ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. జీజీహెచ్‌లో వంశీకి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. కాగా.. జైలులో శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. దీనితో వైద్యం అందించాల్సిందిగా న్యాయధాకారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి వంశీని అనారోగ్యం కారణంగా జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Harish Kumar Gupta: ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
