Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్

Vallabhaneni Vamsi : నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై మంగళవారం నూజివీడు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అనంతరం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకూ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్‌తో ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరు అయినట్లయింది.

Vallabhaneni Vamsi Bail

దీనితో రేపు(బుధవారం) జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంత కాలం రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి తాజా తీర్పు భారీ ఉపశమనమనే చెప్పాలి. అయితే, వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. సదరు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరుగనుంది. దీనితో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ విడుదల అవుతారా, లేదా? అన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాగా, ఇప్పటివరకూ నమోదైన 10 కేసుల్లోనూ వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయ్యింది.

Also Read : CM Revanth Reddy: పాశమైలారం బాధితుల పరామర్శ ! మృతులకు కోటి చొప్పున పరిహారం !

Leave A Reply

Your Email Id will not be published!