Vallabhaneni Vamsi: జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని వంశీపై సుమారు 11 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ వచ్చేసరికి మరోకేసు నమోదు కావడంతో సుమారు 140 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. అయితే ఇళ్ల పట్టాల కేసులో విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు తాగాజా బెయిల్‌ మంజూరు చేసింది. దీనితో బుధవారం మద్యాహ్నం విజయవాడ సబ్‌ జైల్‌ నుంచి వంశీ విడుదలయ్యారు.

Vallabhaneni Vamsi Released from Jail

వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు.

కాగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై (Vallabhaneni Vamsi) ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై నాలుగు వారాల క్రితమే వాదనలు ముగియగా.. నిన్న (మంగళవారం) వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వంశీపై ఉన్న రెండు కేసుల్లో కూడా గత నెలలోనే ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా నకిలీ ఇళ్లపట్టాల కేసులో బెయిల్ రావడంతో ఈరోజు వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

Also Read : Minister Kandula Durgesh: కార్డేలియా సముద్ర విహార నౌకను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

Leave A Reply

Your Email Id will not be published!