Varahi Yatra Pawan : 9 నుంచి రెండో దశ వారాహి యాత్ర
ప్రకటించిన జన సేన పార్టీ
Varahi Yatra Pawan : పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రెండో దశ వారాహి విజయ యాత్ర(Varahi Yatra) జూలై 9న ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ యాత్ర 9వ తేదీ ఏలూరు నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొంది. అనంతరం 10వ తేదీన సోమవారం మధ్యాహ్నం జన వాణి కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది జనసేన పార్టీ.
అదే రోజు సాయంత్రం 6 గంటలక ఏలూరు నియోజవర్గం పరిధిలోని పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపింది. ఇందులో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యేకంగా చర్చిస్తుంది. అనంతరం 11న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గానికి చేరుకుంటారు.
అక్కడ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, వీర మహిళలతో సమావేశం ఉంటుందని జనసేన పార్టీ పేర్కొంది. ఈ కీలక భేటీ తర్వాత సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి గూడెంకు చేరుకుంటారు పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అనంతరం కీలకమైన బహిరంగ సభ ఉంటుందని పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేనాని పాల్గొని ప్రసంగిస్తారని స్పష్టం చేసింది జనసేన.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి దశ వారాహి విజయ యాత్ర సక్సెస్ అయ్యింది. భారీ ఎత్తున జనం ఆదరించారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎంను, మంత్రులు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు. నిప్పులు చెరిగారు.
Also Read : PM Modi Visits : భద్రకాళి ఆలయంలో మోదీ
