Varun Chakravarthy KKR : వరుణ్ చక్రవర్తి బౌలింగ్ మ్యాజిక్
4 ఓవర్లు 24 పరుగులు 3 వికెట్లు
Varun Chakravarthy KKR : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో నితీష్ రాణా సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ ఆర్సీబీకి ( KKR vs RCB ) బిగ్ షాక్ ఇచ్చింది. 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టైటిల్ గెలవాలన్న కసితో ఉన్న బెంగళూరుకు ఈ ఓటమి ఇబ్బందికరంగా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి పోయింది ముందుగా బ్యాటింగ్ కు దిగింది కోల్ కతా. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది. ఇంగ్లీస్ స్టార్ క్రికెటర్ జేసన్ రాయ్ మరోసారి రెచ్చి పోయాడు. వరుసగా అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ. .26 బంతులు ఎదుర్కొని 56 రన్స్ చేశాడు. 4 ఫోర్లు 5 సిక్సర్లతో దంచి కొట్టాడు. కెప్టెన్ నితీశ్ రాణా సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
అనంతరం 201 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలో దూకుడుగా ప్రారంభించింది. విరాట్ కోహ్లీ దూకుడు పెంచాడు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ ఆ తర్వాత బిగ్ షాట్ కొట్టబోయి పెవిలియన్ దారి పట్టాడు.
అద్భుతమైన బౌలింగ్ తో కోల్ కతా బౌలర్లు దుమ్ము రేపారు. బెంగళూరు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి మెరిశాడు. కళ్లు చెదిరే బంతులతో పరేషాన్ చేశాడు. 4 ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy KKR) 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆండ్రీ రస్సెల్ 2, నూయిష్ శర్మ 2 వికెట్లు తీశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read : కోహ్లీ మెరిసినా తప్పని ఓటమి