Varun Gandhi : యూపీ సర్కార్ పై వరుణ్ గాంధీ ఫైర్
కోట్లు ఖర్చు చేశారు నాణ్యత మరిచారు
Varun Gandhi : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గత కొంత కాలం నుంచీ తమ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. గతంలో రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు.
మొన్నటికి మొన్న అగ్నిపథ్ ను విమర్శించారు. దేశంలో ఖాళీగా ఉన్న జాబ్స్ విషయంపై సమగ్ర సమాచారాన్ని దేశం ముందు పెట్టారు. దీనిని ఆధారంగా చేసుకుని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర సర్కార్ ను నిలదీశారు.
తాజాగా మరోసారి యూపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరుణ్ గాంధీ(Varun Gandhi) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి కాషాయ వర్గాలలో. తాజాగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ, సీఎం యోగిలను.
ఈనెల 16న 296 కిలోమీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించారు. చిత్ర కూట్ లోని భరత్ కూప్ నుంచి ఇటావా లోని కుంద్రెల్ ను కలిపే నాలుగు లైన్ల రోడ్డును రూ. 15 వేల కోట్లతో నిర్మించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు జలౌన్ జిల్లా సమీపంలో కొన్ని చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడడంతో దీనిని తీవ్రంగా తప్పు పట్టారు ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi) . కోట్లు ఖర్చు చేశారు.
ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. దీనికి ఎవరు బాధ్యులంటూ ప్రశ్నించారు. రోడ్డు ప్రారంభించిన వారం రోజుల్లోనే గుంతలు ఎలా ఏర్పడతాయంటూ నిలదీశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ప్రాజెక్ట్ హెడ్, కంపెనీలు, ఇంజనీర్లకు వెంటనే సమన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : వృద్దులపై కేంద్రం వివక్ష తగదు – రాహుల్