VC Sajjanar : కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ చేయూత
రూ. 40 లక్షల ఆర్థిక సాయం
VC Sajjanar : హైదరాబాద్ – ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ భరోసా కల్పించింది. రూ. 40 లక్షల ఆర్థిక సాయం అందజేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ లో మెదక్ డిపోకు చెందిన కండక్టర్ సీహెచ్. అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు.
VC Sajjanar Comment
విధులు ముగించుకుని తన స్వగ్రామం నాగపూర్ కి బైక్ పై వెళ్తున్న ఆయనను.. త్రిబుల్ రైడింగ్ తో దూసుకువచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. మెదక్ జిల్లా హవేలి ఘనాపూర్ లోని టీ టైమ్ వద్ద జరిగిందీ ప్రమాదం. ఈ రోడ్డు ప్రమాదంలో సీహెచ్. అంజయ్యకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆయన మరణించారు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.
ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్‌ను ఇటీవల యూబీఐకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు వరకు యూబీఐ అందజేస్తోంది.
హైదరాబాద్ బస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అంజయ్య కుటుంబానికి ఆర్థిక సాయం కింద చెక్కును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) అందజేశారు. బాధితుడి భార్య మణెమ్మ, కుమారుడు సంతోష్ కుమార్ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Revanth Reddy : సంస్కృతికి ప్రతిబింబం భవన నిర్మాణం
