Vice Chancellor Appointments: 17 యూనివర్సిటీలకు ఇన్ ఛార్జ్ వీసీల నియామకం !
17 యూనివర్సిటీలకు ఇన్ ఛార్జ్ వీసీల నియామకం !
Vice Chancellor: ఏపీలోని 17 యూనివర్సిటీలకు ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్ల (వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు చెసి బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే ఉపకులపతు (వీసీ)ల రాజీనామాలను ఆమోదించడంతో పాటు ఇన్‌ఛార్జి వీసీలను నియమిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
Vice Chancellor Appointments…
విశ్వవిద్యాలయాల ఉపకులపతు(వీసీ)ల రాజీనామాలను ఆమోదించడంతో పాటు ఇన్‌ఛార్జి వీసీలను నియమిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌టీయూ-జీవీ విజయనగరం, జేఎన్‌టీయూ-కాకినాడ, ఆంధ్ర, ఆదికవి నన్నయ, కృష్ణా, ఆచార్య నాగార్జున, ఆంధ్రకేసరి, విక్రమసింహాపురి, పద్మావతి మహిళ, శ్రీవేంకటేశ్వర, ద్రవిడ, యోగివేమన, డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్, శ్రీకృష్ణదేవరాయ, జేఎన్‌టీయూ-అనంతపురం, రాయలసీమ, అబ్దుల్‌హక్ ఉర్దూ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇటీవల పలు కారణాలతో రాజీనామాలు చేశారు. వాటికి గవర్నర్ ఆమోదం తెలపడంతో వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చెసి. అలగే తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్‌చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు.
Also Read : Telangana Rains: అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలెరో ట్రాలీ వాహనం !