Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా

Jagdeep Dhankhar : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలం మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

Jagdeep Dhankhar Resign

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ధన్‌ఖడ్‌ రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్, తరువాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. రాజస్థాన్ హైకోర్టు,సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆతర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

1989 జనతాదళ్ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు
1990లో పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు
1993–1998: రాజస్థాన్ శాసనసభ సభ్యుడిగా సేవలందించారు
2019–2022: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు
2022: ఎన్‌డీఏ తరఫున ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.

అయితే ఈ ఏడాది మార్చి నెలలో ఛాతి నొప్పితో ఎయిమ్స్‌లో చేరారు. తాజాగా, ఇవాళ అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.

Also Read : VS Achuthanandan: కేరళ మాజీ సీఎం వీఎస్‌ అచ్యుతానందన్‌ మృతి

Leave A Reply

Your Email Id will not be published!