Vice Presidential Poll : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ గెలుపు
ఓటమి పాలైన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా
Vice Presidential Poll : అంతా ఊహించినట్లుగానే జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన జగదీప్ ధన్ ఖర్ ఘన విజయం సాధించారు.
తన సమీప ప్రతిపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతిగా పోటీలో(Vice Presidential Poll) ఉన్న మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వాపై గెలుపొందారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ కు 528 కోట్లు వచ్చాయి.
యూపీఏ అభ్యర్థి మార్గరెట్ కు కేవలం 182 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇక 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. భారత దేశంలో రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి.
ఇక ఆగస్టు 10వ తేదీతో ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు తన పదవీ కాలం ముగస్తుంది. ఇక జగదీప్ ధన్ ఖర్ 14వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శనివారం జరిగిన పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశ ప్రధాని మోదీతో పాటు మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా తన విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాక పోతే ఆరోగ్యం సహకరించక పోయినా మాజీ పీఎం ఓటు వేయడం విశేషం. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైనదో ఆయనను చూసి మిగతా ప్రజా ప్రతినిధులు నేర్చుకోవాలి.
ఇదిలా ఉండగా ధన్ ఖర్ విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు లోక్ సభ కార్యదర్శి జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్.
Also Read : అమరులైన రైతన్నలకు రూ. 39.55 కోట్లు