Vijay Nair Arrest : లిక్క‌ర్ స్కాంలో విజ‌య్ నాయ‌ర్ అరెస్ట్

కొన‌సాగుతున్న అరెస్ట్ ల ప‌రంప‌ర

Vijay Nair Arrest : ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన లిక్క‌ర్ స్కాంలో మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌ని ఆరోపిస్తూ ఈడీ రంగంలోకి దిగింది. సీబీఐ న‌మోదు చేసిన కేసు ఆధారంగా జ‌ల్లెడ ప‌డుతోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల‌లో ఈ కేసుకు సంబంధించిన లింకుల మేర‌కు సోదాలు చేప‌ట్టింది.

హైద‌రాబాద్ లో వెన్న‌మ‌నేని శ్రీ‌నివాస్ రావును అరెస్ట్ చేసింది. బుధ‌వారం కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో ప్ర‌ముఖ లిక్క‌ర్ వ్యాపార వేత్త స‌మీర్ సువేంద్రును అరెస్ట్ చేసింది. ఇదే స‌మ‌యంలో డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు స‌హ‌కారం చేశార‌నే ఆరోప‌ణ‌పై విజ‌య్ నాయ‌ర్(Vijay Nair) ను ప్ర‌శ్నించింది.

ఆయ‌న ఎంత‌కూ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించ‌క పోవ‌డంతో ఆ వెంట‌నే అదుపులోకి(Vijay Nair Arrest) తీసుకుంది ఈడీ. ఇదిలా ఉండ‌గా సీబీఐ న‌మోదు చేసిన ఛార్జిషీటులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను నిందితుడిగా చేర్చింది. ఆయ‌న‌తో పాటు 14 మందిపై అభియోగాలు మోపింది.

ఇందులో విజ‌య్ నాయ‌ర్ కూడా ఒక‌రిగా ఉన్నారు. సిసోడియా(Manish Sisodia) పేరు చెప్పేందుకు నిరాక‌రించినందుకు అదుపులోకి తీసుకున్న‌ట్లు ఈడీ వెల్ల‌డించింది ఇవాళ‌. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ కేసులో త‌న క‌మ్యూనికేష‌న్ ఇన్ ఛార్జి విజ‌య్ నాయ‌ర్ ను సీబీఐ అరెస్ట్ చేయ‌డాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది.

సిసోడియాను ఇంప్లీడ్ చేయాల‌నే ఏజెన్సీ ఒత్తిడిచేసింద‌ని ఆరోపించింది. మ‌రో వైపు తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ రావుల‌కు అనుచ‌రుడిగా పేరొందిన వెన్న‌మ‌నేని శ్రీ‌నివాస్ రావును ఈడీ అరెస్ట్ చేసింది.

Also Read : శేష‌న్న అరెస్ట్ తో క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!