Vijay Sai Reddy : పురందేశ్వరిపై విజయ సాయి ఫైర్
తనపై సీజేఐకి లేఖ రాయడం
Vijay Sai Reddy : అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. తనతో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి లేఖ రాయడంపై తీవ్రంగా స్పందించారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఆనాడు పెట్టిన కేసులు ఇలాగే కొనసాగుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. పురందేశ్వరి ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
Vijay Sai Reddy Serious Comments on Purandeswari
ఎవరు స్క్రిప్టు రాసి ఇస్తే చదువుతున్నారో చెబితే బాగుంటుందని సెలవు ఇచ్చారు. మీరు చేసే తప్పులు కప్పి పుచ్చుకునేందుకు చేస్తున్న అనవసర రాద్దాంతం తప్పితే ఇంకేమీ లేదన్నారు. ఒకవేళ తప్పులు చేసి ఉంటే ఏనాడో న్యాయ స్థానాలకు తమకు శిక్షలు విధించి ఉండేవని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy).
తన పదవిని కాపాడుకునేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచడం లేదని, అందుకే తమను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు.
ఇకనైనా ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. విచిత్రం ఏమిటంటే పురందేశ్వరి తను బీజేపీకి అధ్యక్షురాలా లేక నారా చంద్రబాబు నాయుడు లేని తెలుగుదేశం పార్టీకి చీఫా అన్నది ముందు బయటకు చెప్పాలన్నారు.
Also Read : Purandeswari : సీజేఐకి పురందేశ్వరి లేఖ