Vijaya Shanti : హస్తం గూటికి రాములమ్మ
ఖర్గే సమక్షంలో చేరిన నటి
Vijaya Shanti : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ప్రముఖ సినీ నటి , సీనియర్ నాయకురాలు విజయ శాంతి కమలానికి కటీఫ్ చెప్పారు. తిరిగి తాను గతంలో పని చేసిన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
Vijaya Shanti Joined in Congress
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు విజయశాంతి(Vijaya Shanti). ఆమె గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రధాన సమస్యలపై నిలదీస్తూ వచ్చారు. తను ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు.
దీంతో తెలంగాణ ఏర్పాటు అయ్యాక అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఎంపీగా పని చేశారు. కానీ ఎందుకనో కేసీఆర్ తో పొసగక గులాబీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తిరిగి కమలం గూటికి చేరారు. మరోసారి తన స్వంత పార్టీలోకి జంప్ అయ్యారు.
పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదని, ప్రత్యేకంగా బీసీలు అంటే బీజేపీలో చులకన భావం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక విజయశాంతి గుడ్ బై చెప్పడంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
Also Read : Minister KTR : అజ్జూ గ్రేట్ క్రికెటర్ కానీ లీడర్ కాదు