Vijaya Shanti : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి
Vijaya Shanti : హైదరాబాద్ – కోరి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి(Vijaya Shanti) ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసింది నువ్వు కాదా అంటూ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు విజయశాంతి.
Vijaya Shanti Slams KCR
మోసానికి చిరునామా కేసీఆర్ పాలన అంటూ మండిపడ్డారు. తెలంగాణ పేరుతో నిట్ట నిలువునా దోపిడీకి పాల్పడింది నువ్వు కాదా అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేలు గెలువలేమని స్పష్టంగా తెలుసుకున్న పరిస్థితి ఉండి కడూఆ బీసీ సీఎం అంటున్న బీజేపీ మాటలు పూర్తి అబద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క బీసీ కైనా ఆ స్థాయికి సరి తూగ గలిగే వ్యక్తికి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఇచ్చారా అంటూ కేంద్ర సర్కార్ ను నిలదీశారు విజయశాంతి. ఇకనైనా ప్రజలు మేలు కోవాలని కేసీఆర్ పనై పోయిందంటూ మండిపడ్డారు. ఇక ఫామ్ హౌస్ లో పడు కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తమకు 119 సీట్లలో కనీసం 80 సీట్లకు పైగా వస్తాయని స్పష్టం చేశారు విజయశాంతి. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా వర్కవుట్ కాదన్నారు.
Also Read : Telangana CEO Vikas Raj : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం