AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు
AP Liquor Scam : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఈ మద్యం కుంభకోణం కు సంబంధించి నిజాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్… ఈ కేసులో కీలకపాత్ర పోషించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, వైసీపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంకు(AP Liquor Scam) సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి(Vijayasai Reddy) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు సిట్ బృందం వెల్లడించింది.
AP Liquor Scam on Vijayasai Reddy
ఇదిలా ఉండగా… మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, వైసీపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు, సిట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విచారణకు హాజకావాలని హైకోర్టు చెప్పినా… ఆదేశాలను లెక్కచేయకుండా కసిరెడ్డి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం నాడు ఏకకాలంలో 15 చోట్ల సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. అలాగే అతని బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లలోనూ సోదాలు చేశారు.
ఏక్తా హైట్స్, కసిరెడ్డి భార్య డైరెక్టర్ గా ఉన్న అరేటి ఆస్పత్రి, అలాగే అతని అత్త ఇంట్లోనూ దాడులు నిర్వహించారు. మద్యం కుంభకోణంలో ప్రతి నెలా రూ.60 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు దాదాపు రూ.3 వేల కోట్లు వసూలు చేయడంలో కసిరెడ్డి ప్రధాన ప్రాతధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు విచారణ హాజరుకావాలని కోరగా… ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు అతను దేశం విడిచి పారిపోకుండా అధికారులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు.
Also Read : Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సగం ప్లాట్ ఫామ్ లు మూసివేత