Vijayashanti KCR : కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకుంటే బెటర్
నిప్పులు చెరిగిన విజయశాంతి
Vijayashanti KCR : భారతీయ జనతా పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గవర్నర్ పట్ల దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే ఉత్సవాలను కావాలని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహంచకుండా అవమానించిందని ఆరోపించారు.
గత కొంత కాలంగా మహిళ అని చూడకుండా ఇలాగే వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. ముందు నుంచి సీఎం కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదన్నారు. ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారని ఆవేదన చెందారు విజయశాంతి(Vijayashanti KCR). రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, ప్రజల సమస్యలు పరిష్కరించే నాథుడే లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కు కాలం చెల్లిందని, త్వరలోనే జనం ఆయనకు మంగళం పాడడం ఖాయమని జోష్యం చెప్పారు. త్వరగా వీఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని పోతుందని సంచలన కామెంట్స్ చేశారు. నిన్నటి దాకా టీఆర్ఎస్ అన్నారు ఇవాళ బీఆర్ఎస్ అంటూ కొత్త నాటకానికి తెర లేపాడని , ఆయనవన్నీ జిమ్మిక్కులు తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని మండిపడ్డారు విజయ శాంతి.
కేసీఆర్ పనై పోయిందని , ఆయన పదవీ విరమణ తీసుకోవడం మంచిదని సూచించారు. బీజేపీలో చేరికలు మరింత పెరగడం ఖాయమని, రాబోయే ఎన్నికల్లో తాము పవర్ లోకి వస్తామని చెప్పారు విజయశాంతి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మోసం చేసింది చాలక ఇప్పుడు మరో కొత్త అవతారానికి తెర తీశాడని ధ్వజమెత్తారు.
Also Read : ప్రభుత్వ నిర్వాకం రాజ్యాంగానికి అవమానం