Vijayawada Festival: విజయవాడ ఫెస్టివల్ కు ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి

విజయవాడ ఫెస్టివల్ కు ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి

Vijayawada Festival : కృష్ణాజిల్లా సంస్కృతి, సంప్రదాయాల ప్రతిభను మించేలా విజయవాడ ఫెస్టివల్ ఉండబోతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో విజయవాడ ఫెస్టివల్ (Vijayawada Festival) ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఫెస్టివల్ రేపు (సోమవారం) ప్రారంభ అవుతుందని తెలిపారు.

Vijayawada Festival Updates

24వ తేదీన భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) విజయవాడ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయవాడలో తొలిసారిగా పర్యటిస్తున్నారని చెప్పుకొచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఫెస్టివల్‌ కు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని వివరించారు ఎంపీ కేశినేని శివనాథ్.

విజయవాడ అభివృద్ధిని కొంతమంది వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పున్నమి ఘాట్‌లో ప్రతిరోజు విజయవాడ వైభవాన్ని తెలిపే విధంగా డ్రోన్ షో ఉంటుందని తెలిపారు. రేపు విజయవాడ ఫెస్టివల్‌ని లాంఛనంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని వెల్లడించారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే క్రాకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

ఆర్డీటీ సేవలపై మంత్రి నారా లోకేష్‌ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆర్డీటీ సేవలపై క్లారిటీ ఇచ్చారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ మాంఛో ఫెర్రర్‌ నిర్వాహకులతో ఇవాళ (ఆదివారం) ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్‌. ఈ సందర్భంగా ఆర్డీటీ (RDT) సేవలపై కీలక ప్రకటన చేశారు. ఆర్డీటీ (RDT) సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌.

కేంద్రం ప్రభుత్వంతో ఆర్డీటీ (RDT) సేవల గురించి మాట్లాడుతున్నామని వివరించారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఆర్డీటీ అని ఉద్ఘాటించారు. మానవత్వానికి చిరునామా మాంఛో ఫెర్రర్ అని ప్రశంసించారు. ఆర్డీటీ (RDT)అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదని… లక్షలాది మంది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశాకిరణమని నొక్కిచెప్పారు. ఆర్డీటీ(RDT) వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. వాటిని శాశ్వతంగా పరిష్కరించి ఆర్డీటీ(RDT) సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్‌ భరోసా ఇచ్చారు.

Also Read : Road Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Leave A Reply

Your Email Id will not be published!