Vikram Misri: విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్‌ మిస్రీ !

విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్‌ మిస్రీ !

Vikram Misri: ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్‌ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్‌ అధికారి చైనా వ్యవహారాల్లో నిష్ణాతుడు. వినయ్‌ క్వాత్రా స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతలను జులై 15న విక్రమ్‌ మిస్రీ చేపడతారని కేబినెట్‌ నియామకాల కమిటీ తెలిపింది.

Vikram Misri As a…

ప్రస్తుత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా త్వరలో అమెరికాలో భారత రాయబారిగా నియమితులు కానున్నారని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రం విక్రమ్ మిస్రీను ఆయన స్థానంలో భర్తీ చేసింది. విక్రమ్‌ మిస్రీ… గతంలో ముగ్గురు ప్రధాన మంత్రుల (ఐ.కె.గుజ్రాల్, మన్మోహన్‌సింగ్, నరేంద్ర మోదీ) వద్ద ప్రైవేటు సెక్రెటరీగా సేవలు అందించారు.

Also Read : M. K. Stalin: నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మాణం !

Leave A Reply

Your Email Id will not be published!