Virat Kohli : విండీస్ లోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇవాళ అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. అమీ తుమీ తేల్చుకునేందుకు యువ భారత్ రెడీ అయ్యింది. ఆసిస్ ను సెమీ ఫైనల్ లో ఓడించి ఫైనల్ కు చేరింది.
ఇంకో సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ ఆఫ్గనిస్తాన్ పై విజయం సాధించి నేరుగా చేరుకుంది. ఇరు జట్లు ఫైనల్ పోరుకు రెడీ అయ్యాయి.
ఇటు భారత్ అటు ఇంగ్లండ్ ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా అన్ని మ్యాచ్ లు గెలిచి నేరుగా ఛాంపియన్ గా నిలిచేందుకు సిద్దమయ్యాయి.
దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కెప్టెన్ సెంచరీతో తన సత్తా చాటాడు. 24 ఏళ్ల సుదీర్ఘ అనంతరం ఇంగ్లండ్ ఫైనల్ కు చేరింది.
దీంతో ఎలాగైనా సరే కప్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో భారత స్టార్ ప్లేయర్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో(Virat Kohli) భారత యువ ఆటగాళ్లు వర్చువల్ గా మాట్లాడారు.
ఈ సందర్భంగా కోహ్లీ (Virat Kohli)భారత జట్టు వరల్డ్ కప్ తో భారత్ కు తిరిగి రావాలని పిలుపునిచ్చాడు. ఇప్పటికే కెప్టెన్ యశ్ ధుల్ తో పాటు రషీద్ టాప్ లో ఉన్నారు.
ఇదిలా ఉండగా 2008లో కౌలాలంపూర్ లో జరిగిన ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి అండర్ -19 వరల్డ్ కప్ ను తీసుకు వచ్చాడు. భారత జట్టు నాలుగుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచింది.
తన ట్విట్టర్ ఖాతాలో ప్రపంచ కప్ ఫైనల్ కు మా అండర్ -19 కుర్రాళ్లకు శుభాకాంక్షలు అంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.
Also Read : పాకిస్తాన్ తో ఆసిస్ సీరీస్ సిద్దం