Virat Kohli : ముంబై – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సుదీర్ఘ కాలం తర్వాత దాయాది పాకిస్తాన్ జట్టు భారత దేశంలో కాలు మోపింది. ఆ జట్టు న్యూజిలాండ్ , ఇండియా , ఆస్ట్రేలియా, నెదర్లాండ్ జట్లతో తలపడనుంది.
Virat Kohli Expressed Happiness
ఇవాళ దుబాయ్ మీదుగా నేరుగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది పాకిస్తాన్ టీమ్. ఈ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇండియాలో కాలు మోపడం పట్ల విరాట్ కోహ్లీ(Virat Kohli) సంతోషం వ్యక్తం చేశాడు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ మేరకు 7 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ టీమ్ భారత్ కు రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ.
ఈ సందర్బంగా బాబర్ ఆజమ్ జట్టు సభ్యులను ప్రత్యేకంగా అభినందించాడు. అంతే కాదు తన ఇంట్లో ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తానని, మీ అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు విరాట్ కోహ్లీ. విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ లో విరాట్ కోహ్లీకి భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. అతడి అగ్రెస్సివ్ నెస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేసింది.
Also Read : Pakitsan Team Arrives : హైదరాబాద్ కు చేరుకున్న పాక్ టీమ్