Jemima Rodrigues Kohli : విరాట్ కోహ్లీ నాకు స్పూర్తి – జెమీమా
పాకిస్తాన్ పై గెలుపులో కీలక పాత్ర
Jemima Rodrigues Kohli : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ మెగా లీగ్ లో తొలి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది భారత మహిళా జట్టు. 150 పరుగుల టార్గెట్ ను కేవలం 19 ఓవర్లలోనే పూర్తి చేసింది. మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో జెమీమా రోడ్రిగ్స్ , షెఫాలీ వర్మ, రిచా రాణించారు. ప్రధానంగా జెమీమా ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించింది. అద్భుతమైన షాట్స్ తో అలరించింది.
కేవలం 38 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జెమీమా రోడ్రిగ్స్ 53 రన్స్ చేసింది. మ్యాచ్ చివరి దాకా నిలిచింది. టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. మ్యాచ్ అనంతరం జెమీమా మీడియాతో మాట్లాడారు. తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడేందుకు తాను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి స్పూర్తి పొందానని చెప్పారు.
ఎందుకంటే ఎలాంటి ఒత్తిడి లోనైనా సరే ..మిన్ను మీద పడినా సరే..భూకంపం వచ్చినా సరే ..చెక్కు చెదరకుండా ఉండాలని నేర్చుకున్నానని చెప్పింది. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది జెమీమా రోడ్రిగ్స్(Jemima Rodrigues) .
గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పురుషుల టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిందని..అందులో కోహ్లీ 53 బంతుల్లో 82 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడని ఆ ఇన్నింగ్స్ ను తాను మరిచి పోలేక పోతున్నానని పేర్కొన్నారు .
Also Read : వరల్డ్ కప్ లో పాక్ కు భారత్ షాక్