Virat Kohli : సంపాదనలో విరాట్ కోహ్లీ టాప్
స్థిర,చరాస్తుల విలువ రూ. 1000 కోట్లు
Virat Kohli : భారత క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా అతడి ఆస్తుల విలువ మరింత పెరగడం విశేషం. విచిత్రం ఏమిటంటే ఏదో వంద కోట్లు అనుకుంటే పొరపాటు పడినట్లే. రన్ మెషీన్ స్థిర,చర ఆస్తులు కలుపుకుని రూ. 1,050 కోట్ల దాకా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. భారతీయ క్రికెట్ రంగంలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం కలిగి ఉన్న ఆటగాడు ఎవరూ లేక పోవడం విశేషం. విరాట్ కోహ్లీతో 18 కంపెనీలు ఒప్పందం కలిగి ఉన్నాయి. వాటి ద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతోంది.
మరో వైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తున్నాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఫీజు కింద రూ. 15 కోట్లకు పైగా చెల్లిస్తోంది. అంతే కాదు బీసీసీఐ ఏడాదికి కాంట్రాక్టు కింద రూ. 7 కోట్లు సమర్పించుకుంటోంది. ఇక ఇతరత్రా వాటి ద్వారా కూడా భారీగానే వెనకేసుకుంటున్నాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).
ఇక మనోడి పోస్టులకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది. ఇందులో భాగంగా మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ లో, ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసే పోస్టులు, ఫోటోలు, వీడియోలకు భారీ ఎత్తున ఆదాయం గడిస్తున్నాడు. ఇక ఒప్పందం చేసుకోని కంపెనీలు చాలా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా విరాట్ కోహ్లీ ఆట పరంగా రికార్డులను పక్కన పెడితే ఒక క్రికెటర్ గా వేయి కోట్లు దాటడం మామూలు విషయం కాదు కదూ.
Also Read : CM YS Jagan : విద్యా రంగానికి జగన్ భరోసా