Virgin Australia Airlines: విమానంలో నగ్నంగా పరుగులు తీసిన ప్రయాణికుడు !

విమానంలో నగ్నంగా పరుగులు తీసిన ప్రయాణికుడు !

Virgin Australia Airlines: విమానంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అత్యవసర ద్వారాన్ని తెరవడం, సిబ్బందిని గాయపరచడం వంటివి తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతేకాకుండా సిబ్బందిని కిందకు తోసేసి గందరగోళం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్‌ ఆస్ట్రేలియా విమానంలో చోటుచేసుకొంది.

Virgin Australia Airlines- అసలేం జరిగిందంటే ?

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు VA696 విమానం సోమవారం రాత్రి బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని కింద పడేశాడు. అతడి చర్యకు తోటి ప్రయాణికులు హడలెత్తారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.

Also Read : Atishi Marlena: పరువునష్టం కేసులో ఆప్‌ నేత ఆతిశీకి సమన్లు !

Leave A Reply

Your Email Id will not be published!