Ravela Kishore Babu : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు – రావెల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిషోర్ బాబు
Ravela Kishore Babu : భారత రాష్ట్ర సమితి ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రావెల కిషోర్ బాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ ఉక్కు పరిశ్రమ (వైజాగ్ స్టీల్ ప్లాంట్ ) గుండె కాయ లాగా కొన్నేళ్లుగా ఉంటూ వచ్చిందన్నారు.
ట్విట్టర్ వేదికగా రావెల కిషోర్ బాబు(Ravela Kishore Babu) స్పందించారు. ఆరు నూరైనా తమ ప్రాణాలు పోయినా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని , అప్పనంగా ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు.
కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాతీయత పేరుతో దేశానికి చెందిస విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి మెప్పు కోసమని ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెడుతున్నారని ప్రశ్నించారు రావెల కిషోర్ బాబు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తోందని, దానిని తాము ఒప్పుకోమని హెచ్చరించారు రావెల కిషోర్ బాబు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను మానుకోవాలని కోరుతూ పీఎం మోదీకి లేఖ రాశారు.
Also Read : కేసీఆర్ ఎన్నికల ఖర్చుపై ఆకునూరి ఫైర్