Modi : విశిష్టాద్వైతం మాన‌వాళికి మార్గం

శ్రీ‌రామానుజుడు వ‌ర్ధిల్లాలి

Modi : మ‌నుషులంతా ఒక్క‌టే. అస‌మాన‌తులు ఉండ‌రాద‌ని చాటి చెప్పిన మ‌హ‌నీయుడు శ్రీ రామానుజుడు. స‌మతామూర్తి ప్ర‌బోధించిన విశిష్టాద్వైతం స‌మ‌స్త మాన‌వాళికి మార్గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీModi).

మూఢ న‌మ్మ‌కాల‌తో మునిగి పోయిన ఆనాటి స‌మాజాన్ని ఉద్ద‌రించిన దీన జ‌న బాంధ‌వుడు అని కొనియాడారు. రామానుజుల బోధ‌న‌లు నేటికీ అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెప్పారు. ద‌క్షిణాదిన పుట్టిన ఈ మ‌హ‌నీయుడి ప్ర‌భావం దేశం న‌లుమాల‌లా విస్త‌రించింద‌ని అన్నారు.

వ‌సంత పంచ‌మి రోజు మూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం త‌న‌కు సంతోషం క‌లిగించింద‌న్నారు. విశిష్టాద్వైతం ప్రేర‌ణ క‌లిగిస్తుంది. భ‌క్తికి కులం, మ‌తం ఉండాల్సిన ప‌ని లేద‌ని చాటి చెప్పిన మ‌హ‌నీయుడు శ్రీ రామానుజుడు అంటూ కితాబు ఇచ్చారు.

భ‌క్తికి మ‌తం లేదు. కులం లేదు. ప్రాంతం లేదు. అది స‌ర్వం. ప్రపంచ మ‌యం అని పేర్కొన్నారు. ఆనాడే పామ‌రుల‌కు ఆల‌య ప్ర‌వేశం చేయించిన ఘ‌న‌త స‌మ‌తామూర్తికి ద‌క్కుతుంద‌న్నారు.గురువు వ‌ల్ల‌నే జ్ఞానం సిద్దిస్తుంది.

ఈ విగ్ర‌హం మ‌న‌లోని చీక‌టిని పార దోలుతుంది. వెలుగును ఇస్తుంది. మ‌నం స‌క్ర‌మ మార్గాన్ని అనుస‌రించేందుకు దారి చూపిస్తుంద‌న్నారు న‌రేంద్ర మోదీ(Modi).

ప్ర‌గ‌తికి ప్రాచీన‌త‌కు ఎలాంటి భేదం లేద‌న్నారు ప్ర‌ధాని. తెలుగులో అన్న‌మ‌య్య రామానుజుడిని అనుస‌రించారు. క‌న్న‌డ‌లో క‌న్న‌దాసు, ఉత్త‌రాన క‌బీరు దాసు వంటి వారు ఆయ‌న బోధ‌న‌ల‌తో ప్ర‌భావితం అయ్యార‌ని కొనియాడారు.

తాము కూడా రామానుజుడు, అంబేద్క‌ర్, మ‌హాత్మాగాంధీ బోధ‌న‌ల‌తో ఆక‌ర్షితుల‌మ‌య్యామ‌ని చెప్పారు. వారు చూపిన మార్గాన్ని అనుస‌రిస్తూనే దేశంలో పాల‌న సాగిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.

Also Read : భ‌క్తి మార్గం జీవ‌న సౌర‌భం

Leave A Reply

Your Email Id will not be published!