Vishwabrahmins Fire : కేటీఆర్ పై విశ్వ‌బ్రాహ్మ‌ణుల క‌న్నెర్ర‌

ప‌లు చోట్ల దిష్టి బొమ్మ‌ల ద‌హ‌నం

Vishwabrahmins Fire : తెలంగాణ రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మ‌ణులు నిప్పులు(Vishwabrahmins Fire) చెరిగారు మంత్రి కేటీఆర్ మీద‌. త‌మ కులాన్ని త‌క్కువ చేసి మాట్లాడిన మంత్రి వెంట‌నే క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

తాము బ‌లిదానాలు చేసుకుంటే వ‌చ్చిన తెలంగాణ‌లో అధికారాన్ని అనుభ‌విస్తున్న క‌ల్వ‌కుంట్ల కుటుంబం హ‌ద్దు ప‌ద్దు లేకుండా మాట్లాడుతోందంటూ మండిప‌డ్డారు.

జాతీయ బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ త‌ల్లోజు ఆచారిని వ్య‌క్తిగ‌తంగా దూషించారంటూ కేటీఆర్ బేష‌ర‌త్తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎల్బీ న‌గ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. కేటీఆర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేంత దాకా తాము ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. ఎవ‌రి వ‌ల్ల తెలంగాణ వ‌చ్చిందో సోయి త‌ప్పి తెలుసు కోకుండా మాట్లాడుతున్నాడ‌ని ఆరోపించారు.

ఖ‌మ్మంలో శ్రీ‌పాదాచారి, మారోజు వీర‌న్న ఆచారి , శ్రీ‌కాంత్ ఆచారి బ‌లిదానాలు చేసుకుంటే తెలంగాణ వ‌చ్చింద‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ గాంధీగా పిలుచుకునే ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ విశ్వ బ్రాహ్మ‌ణుడేన‌న్నది అప్పుడే మ‌రిచి పోయిన‌వా కేటీఆర్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను దూషించిన ఏ ఒక్క‌రు బ‌తికి బ‌ట్ట క‌ట్టిన పాపాన పోలేద‌న్నారు. ప‌వ‌ర్ ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడం సంస్కారం అనిపించు కోద‌న్నారు. గ‌తంలో కూడా ఇలాగే నోరు పారేసుకున్నాడ‌ని విశ్వ‌బ్రాహ్మ‌ణులు ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా కేటీఆర్ స్పందించారు. తాను అలా అన‌లేద‌ని, ఎవ‌రైనా మ‌న‌సు నొప్పిస్తే తాను అన్న మాట‌ల్ని వెన‌క్కి తీసుకుంటాన‌ని పేర్కొన్నారు.

Also Read : హైద‌రాబాద్ అద్భుత‌మైన న‌గ‌రం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!