Vivek Agnihotri : అవాస్తవాలని తేలితే తప్పుకుంటా – వివేక్
ది కాశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు అగ్నిహోత్రి
Vivek Agnihotri : గోవా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) తీసిన ది కాశ్మీర్ ఫైల్స్ పై తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఇఫీ జ్యూరీ ప్రెసిడెంట్ , ఇజ్రాయెల్ దర్శక , నిర్మాత నాదవ్ లాపెడ్ ఇది పూర్తిగా సినిమానే కాదన్నాడు.
అంతే కాదు అనవసరమైన ప్రచార ఆర్భాటం తప్ప ఇందులో సినిమాకు పనికి వచ్చే అంశమే లేదని కుండ బద్దలు కొట్టాడు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీతో సహా భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలన్నీ తమ భుజాల మీద మోశాయి.
అంతే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సినిమాను చూడాలని ప్రచారం చేశారు. ఆపై కేంద్ర హోం శాఖ మంత్రితో పాటు పలువురు సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఇదిలా ఉండగా వివేక్ తీసిన ది కాశ్మీర్ ఫైల్స్ పై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే సెటైర్ వేశారు.
ఇది సినిమా కాదని డాక్యుమెంటరీకి కొంచెం తక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశాడు. ఏది ఏమైనా విపరీతమైన ప్రచారం వల్ల సినిమాకు ఊహించని స్థాయిలో సక్సెస్ వచ్చింది. ఆపై కోట్లు వసూలు అయ్యాయి.
అయితే ప్రజల మనోభావాలను ఇలాగా కూడా క్యాష్ చేసుకోవచ్చంటూ వివేక్ నేర్పాడని అభ్యుదయ వాదులు మండిపడ్డారు. తన సినిమాపై జ్యూరీ చేసిన కామెంట్స్ పై స్పందించాడు దర్శకుడు వివేక్ అగ్నిహొత్రి(Vivek Agnihotri). తాను వాస్తవాలను తీశానని, కాదని అంటే ఇక నుంచి సినిమాలు తీయనని సవాల్ విసిరాడు ఇఫీ జ్యూరీకి.
Also Read : ఫిలిం ఫెస్టివల్ లో కాశ్మీర్ ఫైల్స్ దుమారం