Vivek Ramaswamy : యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రామస్వామి
రెండో ప్రవాస భారతీయుడు కావడం విశేషం
Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయులు పోటీ పడుతుండడం విస్తు పోయేలా చేస్తోంది. భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి బుధవారం తాను కూడా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. ఇటీవల ప్రవాస భారతీయురాలు నిక్కీ హేలీ కూడా ప్రకటించారు. ఆమె మొదటి అభ్యర్థి కాగా రెండో వ్యక్తిగా వివేక్ రామస్వామి నిలిచారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల పోటీలో తాము ఉంటామని స్పష్టం చేశారు.
ఆయన పేరెంట్స్ కేరళ నుండి యుఎస్ కు వలస వచ్చారు. వివేక్ రామస్వామి వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. ఒహియో లోని జనరల్ ఎలక్ట్రికల్ ప్లాంట్ లో పని చేస్తున్నారు. చైనాపై ఆధార పడటాన్ని అంతం చేస్తానని తాజాగా ప్రకటించారు వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) . ప్రైమ్ టైమ్ షో టక్కర్ కార్ల్ సన్ చేసిన ఇంటర్వ్యూలో ఈ కీలక ప్రకటన చేశారు ఎన్నారై.
ఇదిలా ఉండగా ఈనెల ప్రారంభంలో రెండు సార్లు సౌత్ కరోలినా మాజీ గవర్నర్ , ఐక్య రాజ్య సమితిలో మాజీ యుఎస్ రాయబారిగా పని చేసిన ప్రవాస భారతీయురాలు హేలీ నిక్కీ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తన మాజీ బాస్ , యుఎస్ మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పై పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉంది. దీనిని కట్టుదిట్టం చేసి భరోసా ఇవ్వాలంటే తమ నాయకత్వం మినహా మరొకటి లేదన్నారు వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) .
Also Read : పెట్టుబడి సామ్రాజ్య సృష్టకర్త రాజీవ్ జైన్