Kodali Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు… కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై (Kodali Nani) 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు విశాఖవాసి అంజనాప్రియ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT యాక్టు కింద నమోదు చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు.
Kodali Nani – సీఐడీ విచారణలో మాజీ మంత్రి కాకణి పొంతనలేని సమాధానాలు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని గుంటూరు సీఐడీ పోలీసులు ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇవాళ(ఆదివారం), రేపు(సోమవారం) కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విచారణ చేస్తున్నారు. కాకాణిని న్యాయవాది సమక్షంలో గుంటూరు సీఐడీ పోలీసులు ప్రశ్నించారు.
కాగా, మాజీ మంత్రి కాకాణి ఇవాళ (ఆదివారం) మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు (సోమవారం) రెండవ రోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A14గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని 26 ప్రశ్నలు అడిగారు. అయితే సీఐడీ పోలీసుల విచారణకు కాకణి సహకరించండం లేదు. గుంటూరు సీఐడీ పోలీసులు అడిగిన ఒక్క ప్రశ్నకూ కూడా కాకాణి జవాబు ఇవ్వలేదు. తనకు తెలియదు, గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు, తమ న్యాయవాదిని అడగాలని అంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి దాటవేత సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
Also Read : Granite Quarry: బల్లికురవ గ్రానైట్ క్వారీలో ప్రమాదం ! ఆరుగురు మృతి !
