VNRTrio Movie Launch : గ్రాండ్‌గా నితిన్‌ రష్మిక #VNRTrio మూవీ లాంఛ్‌

VNRTrio Movie Launch : టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌ కాంబినేషన్‌గా నిలిచారు హీరో నితిన్ యువ దర్శకుడు వెంకీకుడుముల , రష్మిక మందన్నా. ఈ ముగ్గురి కలయికలో తాజాగా VNRTrio (వర్కింగ్ టైటిల్‌) సినిమా వస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. VNRTrio పూజాకార్యక్రమాలతో ప్రారంభం(VNRTrio Movie Launch)  కాగా.. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు.

ఈ చిత్రానికి టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవితో సినిమా చేయాలని వెంకీ కుడుముల చాలా ఏండ్లుగా నిరీక్షిస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.

నితిన్ సినిమా లాంఛింగ్‌కు చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడం హాట్ టాపిక్‌గా మారింది. వెంకీ కుడుముల కోరిక మేరకే చిరంజీవి ఈవెంట్‌కు వచ్చి ఉంటాడని, భవిష్యత్‌లో వెంకీ, చిరు సినిమా రావడం పక్కా అని చర్చించుకున్నారు సినీ జనాలు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెంకీ కుడుమల ఇంతకుముందు భీష్మ అనే చిత్రంతో నితిన్ కు హిట్ ఇచ్చాడు. మళ్లా 3 ఏళ్ళ గ్యాప్లో నితిన్ తో మరో చిత్రం తెరకెక్కించడం గమనార్హం.

Also Read : ఉత్తమ చిత్రంగా ‘బలగం’ మూవీ ఉగాది నంది పురస్కారం..

Leave A Reply

Your Email Id will not be published!