Volkswagen Taigun : ప్రతి ఏటా ప్రకటించే కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వోక్స్‌వ్యాగన్ (Volkswagen Taigun)కంపెనీ తయారు చేసిన వోక్స్ వ్యాగన్ టైగన్ గెలుచుకుంది. ఈ అవార్డు కోసం భారతీయ కంపెనీలకు చెందిన పలు కార్లు పోటీలో ఉన్నా చివరకు వోక్స్ వ్యాగన్ కైవసం చేసుకుంది.
ప్రధానంగా మహీంద్రా ఎక్స్ యూవీ 700, సిట్రోయెన్ సి5 ఎయిర్ క్రాస్ తో పాటు టాటా కంపెనీకి చెందిన పంచ్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చాయి. ఇక ఈ విభాగంలో ఎక్స్ యూవీ 700 రన్నరప్ గా నిలిచింది.
వోక్స్ వ్యాగన్ టైగన్ కారు తయారీలో నాణ్యత, డిజైన్, నిర్వహణ , తదితర వాటిలో ముందంజలో ఉండడం విశేషం. న్యాయ నిర్ణేతలు, వాహన తనిఖీదారుల నిపుణులు వోక్స్ వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)వైపు మొగ్గు చూపారు.
దీంతో చివరి దాకా గట్టి పోటీ ఇచ్చిన మహీంద్రా కంపెనీ కారు రెండో ప్లేస్ తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా వోక్స్ వ్యాగన్ తయారు చేసిన ఈ టైగన్ కారు గత ఏడాది 2021 సెప్టెంబర్ లో భారత కార్ల మార్కెట్ లోకి ఎంటరైంది.
ఈ కారు మహీంద్రా ఎస్వీయూ కారుతో పోటీ పడింది. క్రెటాతో పోలి ఉన్నప్పటికీ డ్రైవింగ్ డైనమిక్స్ లో ప్రత్యేకతను కలిగి ఉండేలా తీర్చి దిద్దింది వోక్స్ వ్యాగన్ కంపెనీ. హ్యూందాయ్ క్రెట్, కియా సెల్టోస్ కార్లతో ధీటుగా నిలబడింది టైగన్.
ఇదే సమయంలో స్కోడా కంపెనీకి చెందిన కుషాక్ కూడా దీనికి పోటీదారుగా నిలవడం విశేషం. ఈ వాహనాన్ని రెండు వేరియంట్ లలో తీసుకు వచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ లో అందుబాటులో ఉంటోంది.
Also Read : అంకురాలు..ఆవిష్కరణలకు ఊతం